Category Archives: Character

ఈ మాటను గనక ఆవ్యక్తి పలికితే అతని కోపం పటాపంచలయిపోతుంది

1677. హజ్రత్ సులైమాన్ బిన్ సుర్ద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఇంటి) సమీపంలో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోసాగారు. ఆ సమయంలో నేను కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర కూర్చొని వున్నాను. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను కోపంతో రెండవ వ్యక్తిని దూషించటం మొదలుపెట్టాడు. కోపంతో … Continue reading

Posted in Character | Tagged , , , , , , | Leave a comment

ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు

467. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :- “ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు. ఒకరు, అల్లాహ్ సిరిసంపదలు అనుగ్రహించడంతో పాటు, వాటిని దైవమార్గంలో వినియోగించే సద్బుద్ధి కూడా ప్రసాదించబడిన వ్యక్తి. రెండోవాడు, అల్లాహ్ … Continue reading

Posted in Character, Knowledge (ilm), Women | Tagged , , , , , , | Leave a comment

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదు

1502. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- రెండు విషయాల్లో ఒకదాన్ని అవలంబించే స్వేచ్చ ఇవ్వబడినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటిలో సులభమైన విషయాన్నే ఎంచుకునేవారు. అయితే ఆ విషయం పాపకార్యం అయి ఉండరాదు. ఒకవేళ ఆ సులభమైన విషయం పాపకార్యమైతే అందరికంటే ఆయనే దానికి దూరంగా ఉంటారు. దైవప్రవక్త … Continue reading

Posted in Character, Good Deeds | Tagged , , , , , , | Leave a comment

నీరు, పాలు, తదితర పదార్ధాల పంపిణీ కుడివైపు నుండి ఆరంభించాలి

1318. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన మంచినీళ్ళు అడిగితే మేము ఒక మేక నుండి పాలు పితికి అందులో కొంచెం బావినీళ్ళు కలిపి ఆయనకు ఇచ్చాము. ఆ సమయంలో హజ్రత్ అబూబకర్ (రధి అల్లాహు … Continue reading

Posted in Character, telugu-islam-hadith | Tagged , , , | Leave a comment

మితిమీరిన ముఖస్తుతి మంచిది కాదు

1888. హజ్రత్ అబూ బక్రా (రధి అల్లాహు అన్హు) కధనం :- ఒకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఒక వ్యక్తిని పొగిడాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “నువ్వు చెడ్డపని చేశావు. నీవు పొగడ్తలతో, నీ మిత్రుని గొంతుకోశావు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట … Continue reading

Posted in Character, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం

533. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :- ఓ రోజు ఒక స్త్రీ సమాధి మీద కూర్చొని ఏడుస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అటుగా పోవడం జరిగింది. అపుడు ఆయన ఆ స్త్రీని చూసి “అల్లాహ్ కి భయపడి కాస్త సహనం వహించు” అని అన్నారు. దానికి ఆ … Continue reading

Posted in Character, Death and Herefater, telugu-islam-hadith, Women | Tagged , , , , , , | Leave a comment

అబద్ధం చెడ్డ విషయం, సత్యం మంచి విషయం

1675. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :- నిజం మనిషిని పుణ్యకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పుణ్యకార్యాలు (అతడ్ని) స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లప్పుడు నిజం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి) గా … Continue reading

Posted in Character, telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

ఇతరుల ఇండ్లలో తొంగి చూడరాదు

1393. హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాది (రధి అల్లాహు అన్హు) కధనం :- ఒకవ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికెళ్ళి తలుపు కన్నంలో నుంచి లోపలికి తొంగి చూడసాగాడు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో మొనలు గల ఒక ఇనుప దువ్వెన ఉంది. దాంతో ఆయన తల గోక్కుంటున్నారు. … Continue reading

Posted in Character | Leave a comment

ఆహారంలో లోపం ఎత్తి చూపకూడదు

1336. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమయితే తినేవారు, ఇష్టం లేకపోతే మానేసేవారు. (అంతేగాని అందులో అది బాగా లేదు, ఇది బాగా లేదని లోపం ఎత్తి చూపేవారు కాదు). [సహీహ్ బుఖారీ … Continue reading

Posted in Character | Tagged , , , , , , | Leave a comment

ఈర్ష్యాద్వేషాల నిషేధం (Prohibition of Envy)

అన్ అనసిబ్నె మాలికిన్ రదియల్లాహు అన్హు – అన్నరసూలల్లాహి (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఖాల, “లా తబాగదూ, వలా తహాసదూ, వలా తదాబరూ, వకూనూ ఇబాదల్లాహి ఇఖ్ వానా, వలా యహిల్లు లి ముస్లిమిన్, ఐఁయ్యహ్ జుర అఖాహు ఫౌఖ తలాతతి అయ్యామ్” [ముత్తఫిఖున్అలైహి] అనస్ ఇబ్నె మాలికిన్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – … Continue reading

Posted in Character, telugu-islam-hadith | Leave a comment